4 భాషల్లో ట్రాఫిక్ అవేర్నేస్ సేవలు ప్రారభించిన పోలీసులు
- March 19, 2021
అబుధాబి:వాహనదారులు పాటించాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన నిబంధనలపై అవగాహన కల్పించేందుకు అబుధాబి పోలీసులు ఎఫ్ఎం సేవలను ప్రారంభించారు. అరబిక్, ఉర్దూ, ఇంగ్లీష్, తమిళం భాషల్లో 24 గంటల పాటు సూచనలు చేస్తుంటారు. ఎమిరాతి పరిధిలోని మెయిన్ రోడ్డు మీదుగా పోలీస్ చెక్ పాయింట్లకు సమీపంలోకి రాగానే వాహనదారులు ఎలాంటి నిబంధనలు పాటించాలన్నది ఎఫ్ఎం ద్వారా 4 భాషల్లో నిరంతరాయంగా సూచిస్తూనే ఉంటారు. చెక్ పాయింట్ కు సమీపంలోకి రాగానే వాహనాల వేగాన్ని తగ్గించాలి, హెడ్ లైట్ వెలుతురును తగ్గించాలి, క్రమశిక్షణతో ఒకే లేన్ లో వెళ్లాలి, ఫేస్ మాస్కులు ధరించాలి, కుటుంబేతరులు ఒకే వాహనంలో ప్రయాణం చేస్తుంటే వారి సంఖ్య ముగ్గురికి మించి ఉండకూడదు తరహా నిబంధనలను ఎఫ్ఎం ద్వారా గుర్తుచేస్తుంటారు. అలాగే ఎమిరాతి ఐడీ, అల్ హోస్న్ యాప్ లో పీసీఆర్ రిపోర్ట్ చూపించాలి. అలాగే కింగ్డమ్ లోని ఏ విమానాశ్రయంలో దిగినా..వారు ఎక్కడికి వెళ్తున్నారో స్పష్టం చేయాల్సి ఉంటుంది. తనఖీ కేంద్రాల తగ్గర ఫోటోలు తీయటం పూర్తిగా నిషిద్ధం. చెక్ పాయింట్ కు 200 మీటర్ల సమీపానికి వాహనం చేరుకోగానే ఎఫ్ఎం ద్వారా ఇలా సూచిస్తుంటారు. తద్వారా తనిఖీ కేంద్రాల దగ్గర అధికారులకు అడిగిన వివరాలను వాహనదారులు వెంటనే చూపించేందుకు ప్రయాణికుల్లో అవగాహన ఏర్పడుతుంది. ఇదిలాఉంటే...ట్రాఫిక్ జాం, రోడ్డు ప్రమాదాలు, వాతావరణ హెచ్చరికలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించేందుకు ఇప్పటికే ఎఫ్ఎం సేవలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ఎఫ్ఎం ద్వారా నాలుగు భాషల్లో తనఖీ కేంద్రాల దగ్గర పాటించాల్సిన నిబంధనలను 24 గంటల పాటు అందుబాటులోకి తీసుకొచ్చారు అబుధాబి పోలీసులు.
తాజా వార్తలు
- దుబాయ్లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







