భారత్ లో కరోనా కేసుల వివరాలు

- March 22, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. ప్రతీ రోజూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.24 గంటల్లో దేశవ్యాప్తంగా 11 లక్షల 33 వేల మందికి వైద్యపరీక్షలు నిర్వహించగా...46,951మందికి పాజిటివ్‌గా తేలింది.అంతకుముందు రోజుతో పోలిస్తే సుమారు మూడు వేల కేసులు పెరిగాయి.ఇక కరోనా మరణాలు కూడా 24 గంటల వ్యవధిలో 212 నమోదయ్యాయి.అంతకుముందు రోజు 197 మరణాలు నమోదయ్యాయి. పాజిటివ్‌ కేసుల సంఖ్యతో పాటు...రోజువారీ మరణాల్లోనూ పెరుగుదల కనిపిస్తుండటంతో...అందరిలో ఆందోళన పెరిగిపోతోంది.అధికారులు ఎన్ని సూచనలు చేస్తున్నా ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా..పరిస్థితిలో మార్పు రావడం లేదు.  తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా పాఠశాలలు, కాలేజీలు హాట్ స్పాట్‌లుగా మారుతున్నాయి.కరోనా బారిన పడుతున్న విద్యార్థులు, టీచర్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.దీంతో భారత్ లో ఇప్పటివరకు 1,16,46,081 కేసులు నమోదయ్యాయి.ఇందులో 1,11,51,468 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 3,34,646 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో భారత్ లో 21,180 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.అయితే, డిశ్చార్జ్ కేసుల కంటే, పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com