భారత్ లో కరోనా కేసుల వివరాలు
- March 23, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.నాలుగు నెలల క్రితం నుంచి తగ్గుతూ వస్తున్న కేసులు ఇప్పుడు మళ్ళీ పెరగడం ప్రారంభించాయి. కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే మరోసారి లాక్ డౌన్ విధించారు.మరికొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూ వంటివి విధిస్తున్నారు. ఇక తాజాగా కేంద్రం రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం, దేశంలో కొత్తగా 40,715 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,16,86,796కి చేరింది.ఇందులో 1,11,81,253 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,45,477 యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 199 మంది మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,60,166కి చేరింది.రోజువారీ రికవరీ కేసుల సంఖ్య పాజిటివ్ కేసులు అధికంగా ఉండటంతో కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..