పవన్ - రానా డెడ్లీ కాంబో..పాట పాడనున్న పవన్

పవన్ - రానా డెడ్లీ కాంబో..పాట పాడనున్న పవన్

మన స్టార్ హీరోలలో ఎక్కువ పాటలు పాడిన స్టార్ ఎవరంటే టక్కున పవర్ స్టార్ పవన్ కళ్యాణే గుర్తుకు వస్తారు. ఇప్పటి వకూ ఆయన 'తమ్ముడు, ఖుషి, జానీ, గుడుంబా శంకర్, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి' చిత్రాల్లో పాటలు పాడారు. ఆ పాటల వల్ల ఆ యా సినిమాకు ఎంతో క్రేజ్ కూడా వచ్చింది. 

ఇక ఇప్పుడు మరోసారి పవన్ గొంతు సవరించుకోబోతున్నారు. రాబోయే 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ లో పవన్ మరోసారి పాట పాడబోతున్నారు. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు థమన్ నిర్ధారించారు కూడా. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ ని ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రెండు పాటల ట్యూన్స్ కంపోజింగ్ కూడా పూర్తయిందట. ప్రస్తుతం పవన్ 'వకీల్ సాబ్' సినిమా డబ్బింగ్ లో బిజీగా ఉన్నాడు.

Back to Top