ఆండ్రాయిడ్ యాప్స్ క్రాష్..పరిష్కరించేందుకు గూగుల్ సిబ్బంది రెడీ

- March 23, 2021 , by Maagulf
ఆండ్రాయిడ్ యాప్స్ క్రాష్..పరిష్కరించేందుకు గూగుల్ సిబ్బంది రెడీ

ఆండ్రాయిడ్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్. భారత్ తోపాటు ప్రపంచ వ్యాప్తంగా  ఆండ్రాయిడ్ యాప్స్ క్రాష్ అయ్యాయి. కొంతమంది వినియోగదారులు ఆండ్రాయిడ్ పరికరాల్లో  యాప్స్ తో ఇబ్బందులు ఎదురుక్కొంటున్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు గూగుల్ సిబ్బంది పనిచేస్తోంది.

గూగుల్ వర్క్ స్పేస్ స్టేటస్ పేజీలో ఆండ్రాయిడ్ లోని జీమెయిల్ తో సమస్యలు ఉన్నట్లు గూగుల్ అంగీకరించింది. ఈ సమస్యను పరిష్కరించేవరకు వినియోగదారులు డెస్క్ టాప్ వర్షన్ వినియోగించుకోవాలని గూగుల్  సూచిస్తుంది.

ఎవరైతే ఈ సమస్యను ఎదుర్కొటున్నారో..జీమెయిల్ యాక్సెస్ చేయలేరని చెబుతోంది. అయితే త్వరలోనే అప్ డేట్ అందిస్తామని... వీలైనంత త్వరగా ఈ సమస్యను అధిగమిస్తామని గూగుల్  చెబుతోంది.

ఆండ్రాయిడ్ వర్షన్ తో ఇబ్బంది పడుతున్న వారు .. డెస్క్ టాప్  జీమెయిల్ ఇంటర్ ఫేస్ తో వాడుకోవచ్చని సూచిస్తోంది. మరోవైపు శాంసంగ్ కూడా ఈ సమస్యను దృవీకరించింది. యూజర్స్ శాంసంగ్ కొన్ని సూచనలు చేస్తోంది. దయచేసి వెబ్  వ్యూ అప్ డేట్ తీసేసి... ఆ తర్వాత ఫోన్ రిస్టార్ట్ చేయాలని  శాంసంగ్ యూస్ సపోర్ట్ అకౌంట్ నుంచి ట్వీట్ చేసింది.

ఆండ్రాయిడ్ యూజర్లు మార్పులు చేసుకునేందుకు ఈ సెట్టింగ్స్ ఫాలో అవ్వాలని సూచిస్తోంది. సెట్టింగ్స్ > యాప్స్> పైన మూడు చుక్కలపై క్లిక్ చేయాలి > షో సిస్టమ్ యాప్స్ క్లిక్ చేయాలి > సెర్చ్ ఫర్ ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్ వ్యూ > సెలెక్ట్ అనిస్టాల్ అప్ డేట్స్ ను క్లిక్ చేయండని శాంసంగ్ పోస్ట్ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com