దివంగత ఒమాన్ రాజుకు 'గాంధీ శాంతి బహుమతి'
- March 23, 2021
2019 సంవత్సరానికి గాంధీ శాంతి బహుమతిని ఒమాన్‌కు చెందిన దివంగత సుల్తాన్ కబూస్ బిన్ సాయిద్ అల్ సాయిద్‌కు ప్రదానం చేయనున్నారు. భారత్‌తో సంబంధాలను బలోపేతం చేయాలన్న తన దృష్టికి, గల్ఫ్ ప్రాంతంలో శాంతి, అహింసను ప్రోత్సహించడానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా 2019 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన ఈ బహుమతిని ఒమాన్‌కు చెందిన దివంగత సుల్తాన్ కబూస్ బిన్ సాయిద్ అల్ సాయిద్‌కు ప్రదానం చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
2020 సంవత్సరానికి గాంధీ శాంతి బహుమతి బంగాబంధు షేక్ ముజిబూర్ రెహ్మాన్ కు ప్రదానం చేయబడుతుంది.
మహాత్మా గాంధీ 125 వ జయంతి సందర్భంగా గాంధీ శాంతి బహుమతి వార్షిక పురస్కారాన్ని 1995 నుండి భారత ప్రభుత్వం అందిస్తోంది. 2021 మార్చి 19న జ్యూరీ సమావేశమైంది. అహింసాత్మక మరియు ఇతర గాంధేయ పద్ధతుల ద్వారా సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ పరివర్తన కోసం ఆయన చేసిన కృషికి గుర్తింపుగా (లేట్) హెచ్.ఎమ్. సుల్తాన్ కబూస్ బిన్ సాయిద్ అల్ సాయిద్‌కు 2019 సంవత్సరానికి గాంధీ శాంతి బహుమతిని ప్రదానం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
గత అవార్డు గ్రహీతలలో టాంజానియా మాజీ అధ్యక్షుడు డాక్టర్ జూలియస్ నైరెరే వంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు; డాక్టర్ గెర్హార్డ్ ఫిషర్, ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ; రామకృష్ణ మిషన్; బాబా అమ్టే (శ్రీ ముర్లిధర్ దేవిదాస్ అమ్టే); దివంగత డాక్టర్ నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు; గ్రామీణ బ్యాంక్ ఆఫ్ బంగ్లాదేశ్; దక్షిణాఫ్రికా ఆర్చ్ బిషప్ డెస్మండ్ టుటు; శ్రీ చండి ప్రసాద్ భట్ & ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అలాగే ఇటీవలి అవార్డు గ్రహీతలలో వివేకానంద కేంద్రం, ఇండియా (2015); అక్షయ పాత్రా ఫౌండేషన్, ఇండియా మరియు సులాబ్ ఇంటర్నేషనల్ (సంయుక్తంగా, 2016 కోసం); ఏకల్ అభియాన్ ట్రస్ట్, ఇండియా (2017) మరియు శ్రీ యోహీ ససకావా, జపాన్ (2018).
1 కోటి రూపాయల నగదు బహుమతితో పాటు ఒక ప్రశంసా పత్రం, జ్ఞాపిక మరియు సాంప్రదాయ హస్తకళ / చేనేత వస్తువును బహుమతిగా అందిస్తారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..