ప్రాపర్టీ కొనుగోలుదారుల కోసం దుబాయ్‌ కొత్త వెసులుబాటు

- February 29, 2016 , by Maagulf
ప్రాపర్టీ కొనుగోలుదారుల కోసం దుబాయ్‌ కొత్త వెసులుబాటు

దుబాయ్‌ ల్యాండ్‌ డిపార్ట్‌మెంట్‌ (డిఎల్‌డి), తొలి రియల్‌ ఎస్టేట్‌ సర్వీసెస్‌ ట్రస్టీస్‌ సెంటర్‌ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. డిఎల్‌డి డైరెక్టర్‌ జనరల్‌ సుల్తాన్‌ బిన్‌ మెజ్రిన్‌ మాట్లాడుతూ, తమ సర్వీసులను మరింతగా అప్‌గ్రేడ్‌ చేయడం, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో సర్వీసులను వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు వెల్లడించారు. వినియోగదారులకు సంబంధించి అన్ని సందేహాలను తీర్చే విధంగా ఈ సెంటర్స్‌ని ఏర్పాటు చేయనున్నట్లు బిన్‌ మెజ్రిన్‌ చెప్పారు. దీనికోసం అనుభవజ్ఞులైన సిబ్బందిని నియమిస్తున్నామనీ, రౌండ్‌ ది క్లాక్‌ సర్వీసులు అందించే విధంగా సెంటర్లను రూపొందించామని మెజ్రిన్‌ వివరించారు. వినియోగదారులకు వారంలో ఆరు రోజులపాటు, రోజుకి 12 గంటల పాటు సేవలు అందిస్తామని ఆయన తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com