దుబాయ్ డిప్యూటీ రూలర్ కన్నుమూత

- March 24, 2021 , by Maagulf
దుబాయ్ డిప్యూటీ రూలర్ కన్నుమూత

దుబాయ్: దుబాయ్ డిప్యూటీ రూలర్ మరియు ఆర్థిక మంత్రి అయిన షేక్ హమ్దాన్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కన్నుమూశారు.

షేక్ హమ్దాన్..దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కు సోదరుడు.

ఆర్ధిక శాఖకు అండగా..
షేక్ హమ్దాన్ బిన్ రషీద్ 1971 డిసెంబర్ 9 న యూఏఈ మొదటి క్యాబినెట్ ఏర్పడినప్పటి నుండి ఆర్థిక మంత్రి పదవిలో ఉన్నారు. ఆర్థిక విధానాలు మరియు ప్రభుత్వ వ్యయాలను అభివృద్ధి చేయడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు.

యూఏఈ లో ఆర్థిక వ్యవస్థ, కార్మిక మార్కెట్‌కు మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించిన పలు ఉన్నత స్థాయి ప్రభుత్వ సంస్థలకు ఆయన అధ్యక్షత వహించారు. అవి..దుబాయ్ మునిసిపాలిటీ, అల్ మక్తూమ్ ఫౌండేషన్, దుబాయ్ అల్యూమినియం (దుబాల్), దుబాయ్ నేచురల్ గ్యాస్ కంపెనీ లిమిటెడ్, మరియు దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్.

విద్య..
2006 లో షేక్ హమ్దాన్ బిన్ రషీద్..రాయల్ బ్రిటిష్ కాలేజీ నుండి మూడు ప్రశంసాపత్రాలను అందుకున్న మొదటి వ్యక్తిగా ప్రత్యేకతను సాధించారు. రాయల్ బ్రిటిష్ కాలేజ్-లండన్, ఎడిన్బర్గ్, మరియు-గ్లాస్గో నుండి ఇంటర్నల్ మెడిసిన్ కు గాను గౌరవ ఫెలోషిప్ పొందారు.

సంతాపం..
నేటి నుండి పది రోజుల పాటు దుబాయ్‌లో సంతాప దినాలుగా ప్రకటించారు..సగం మాస్ట్ వద్ద ఎగరనున్న జెండా. గురువారం నుండి ఎమిరేట్‌లోని విభాగాలు మరియు సంస్థలలో పనిని మూడు రోజుల పాటు నిలిపివేయడం జరుగుతుంది. యూఏఈ తో సహా ప్రపంచ నేతలు ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com