ఏప్రిల్ 14 నుండి ఆర్జిత సేవలకు అనుమతి - టిటిడి ప్రకటన
- March 24, 2021
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు/ఉత్సవాలకు ఏప్రిల్ 14వ తేదీ నుండి భక్తులను అనుమతిస్తామని టిటిడి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్జిత సేవలు/ఉత‌్సవాల్లో పాల్గొనే గృహస్తులు కోవిడ్-19 నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేస్తోంది. గృహస్తులు సేవకు మూడు రోజులు ముందు పరీక్ష చేయించుకుని కోవిడ్-19 నెగెటివ్ సర్టిఫికేట్‌ను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద తప్పనిసరిగా సమర్పించాలని స్పష్టం చేసింది.
2020 మార్చి 20 నుండి 2021 ఏప్రిల్ 13వ తేదీ వరకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన, సహస్రకళశాభిషేకం, తిరుప్పావడ, మేల్‌చాట్ వస్త్రం, పూరాభిషేకం, పునుగు పాత్ర, కస్తూరి పాత్ర, నిజపాదదర్శనం ఆర్జిత సేవా టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు వీటికి బదులుగా బ్రేక్ దర్శనం లేదా సదరు టికెట్ మొత్తాన్ని రీఫండ్ పొందే సదుపాయాన్ని టిటిడి కల్పించింది.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం