18 రాష్ట్రాల్లో క‌రోనా ‘కొత్త వేరియంట్’

- March 24, 2021 , by Maagulf
18 రాష్ట్రాల్లో క‌రోనా ‘కొత్త వేరియంట్’

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మళ్లీ విస్తరిస్తుంది. కరోనా వేగంగా విస్తరించేందుకు కరోనా వైరస్ కొత్త వేరియంట్లు కారణమని వైద్య వర్గాలు చెబుతున్నయి. ఇండియాలోనూ కొత్త క‌రోనా వేరియంట్ కూడా ఉన్న‌ట్లు ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్ల‌డించింది.
 
భార‌త్‌లో వ్యాప్తి చెందుతున్న క‌రోనా వైర‌స్‌(SARS-CoV-2) జ‌న్యువుల‌ను శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశీలించగా.. జీనోమ్ సీక్వెన్స్ లో స‌రికొత్త‌ వేరియంట్ ను గుర్తించామ‌ని క‌న్‌సోర్టియ‌మ్ ఆఫ్ జీనోమిక్స్‌(ఐఎన్ఎస్ఏసీఓజీ) ప్రకటించింది.
 
కేంద్ర ఆరోగ్య‌శాఖ ఏర్పాటు చేసిన జీనోమిక్స్ క‌న్‌సోర్టియంలో దేశంలోని మొత్తం జాతీయ ప‌రిశోధ‌న‌శాల‌లు భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. కొవిడ్ 19 వైర‌స్ కేసుల‌కు సంబంధించిన జీనోమ్ సీక్వెన్సింగ్‌ను ఐఎన్ఎస్ఏసీఓజీ స్ట‌డీ చేస్తున్న‌ది. తాజా పరిశోధనలో వివిధ దేశాల‌కు చెందిన కరోనా వైరస్ స్ట్రెయిన్ల‌తో పాటు భార‌త్‌కు చెందిన ప్ర‌త్యేక‌మైన వేరియంట్‌ను గుర్తించిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు. కొత్త వేరియంట్ ను 18 రాష్ట్రాల్లో గుర్తించిన‌ట్లు ఆరోగ్య‌శాఖ చెప్పింది.

జీనోమిక్స్ ల్యాబ్‌లు ఇప్ప‌టి వ‌ర‌కు 10787 పాజిటివ్ కేసుల‌ను ప‌రిశీలించి 771 వేరియంట్ల‌ను గుర్తించాయి. వీటిల్లో 736 శ్యాంపిళ్ల‌లో యూకే వేరియంట్ వైర‌స్, 34 శ్యాంపిళ్ల‌లో సౌత్ ఆఫ్రికా వేరియంట్లను గుర్తించారు.
 
మ‌హారాష్ట్ర నుంచి సేక‌రించిన శ్యాంపిళ్ల‌లో వైర‌స్ ఎక్కువ‌గా ప‌రివ‌ర్త‌న చెందిన‌ట్లు గుర్తించారు. E484Q, L452R మ్యుటేష‌న్లు కారణంగా మనిషిలోని ఇమ్యూనిటీపై అధికంగా ప్రభావం చూపుతుంది. దాదాపు 20 శాతం వ‌ర‌కు శ్యాంపిళ్ల‌లో ఇలాంటి మ్యుటేష‌న్ వైర‌స్‌ల‌ను కనుగొనడం ఆందోళన పెంచుతుందని వైద్యశాఖ అధికారులు అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com