రమదాన్ సాయాన్ని పంపిణీ చేసిన రెడ్ క్రిసెంట్ సొసైటీ

- March 24, 2021 , by Maagulf
రమదాన్ సాయాన్ని పంపిణీ చేసిన రెడ్ క్రిసెంట్ సొసైటీ

బహ్రెయిన్: బహ్రెయిన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ, పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో 4000కి పైగా కుటుంబాలకు 73 నగరాల్లో రమదాన్ సాయాన్ని పంపిణీ చేయడం జరిగింది. రానున్న పదిరోజులపాటు ఈ సాయం పంపిణీ కొనసాగుతుంది. బహ్రెయిన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ సెక్రెటరీ జనరల్ ముబారక్ అల్ అతె మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుని పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. చిన్న చిన్న బృందాలు వేర్వేరు సమయాల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నాయి. వాంటీర్లు అలాగే సొసైటీ సభ్యులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీలు, సంస్థలు, ఇతరులు ఈ సాయాన్ని విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com