వీకెండ్ లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం
- March 24, 2021
ఖతార్: ఈ వారాంతంలో పగటి ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరుగుతాయని ఖతార్ వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే శుక్ర, శనివారాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ముఖ్యంగా దేశంలోని మధ్య, దక్షిణ ప్రాంతాలలో వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. సముద్ర ప్రాంతంలో ఆగ్నేయం నుంచి నైరుతి దిశగా నిరంతరంగా ఉష్ణ గాలులు వీయటం ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. బలమైన ఈ గాలుల వల్ల సముద్ర తీరంలో 10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో అలలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అలాగే సముద్ర తీరం ఇవతల ఉన్న భూప్రాంతంలో దుమ్ముతో కూడిన గాలులు ఉంటాయని..దీనికారణంగా దృశ్యమానత 3 కిలోమీటర్లలోపు ఉంటుందని, రోడ్ల మీద కూడా దృశ్యమానత తక్కువగా ఉంటుందన్నారు. ప్రజలు వాతావరణ శాఖ సూచనల మేరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు. అయితే..ఆదివారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం వరకు ఉష్ణోగ్రతల్లో తగ్గుదల ఉంటుందని..సగటున మధ్యాహ్నానం వేళల్లో వేడిగా, రాత్రివేళల్లో వాతావరణం చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..