‘సుల్తాన్’ ట్రైలర్

‘సుల్తాన్’ ట్రైలర్

చెన్నై:తమిళ స్టార్ నటుడు కార్తీ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌ ‘సుల్తాన్‌’. రష్మిక మందాన హీరోయిన్‌గా నటిస్తుంది. బక్కియరాజ్‌ కన్నన్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై య‌స్‌.ఆర్‌.ప్రకాశ్‌బాబు, య‌స్‌.ఆర్‌.ప్రభు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి స్పందన లభించింది. ఈ క్రమంలో తాజాగా 'సుల్తాన్' ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. సుల్తాన్ లో కార్తీ, ర‌ష్మిక మ‌ధ్య ప్రేమ స‌న్నివేశాలు కూడా ఆక‌ట్టుకునేలా క‌నిపిస్తున్నాయి. కాగా కార్తీ యాక్ష‌న్, రొమాంటిక్ తో ట్రైలర్ రొటీన్ గా సాగింది. వినడానికి.. చూడటానికి కొత్తగా అనిపించలేదు. ‘వందమంది రౌడీలను మేనేజ్‌ చేస్తున్నాను.. ఇది చూపులతోనే చంపేస్తుంది..’ అంటూ కార్తీ చెప్పే డైలాగులు బాగున్నాయి. ఏప్రిల్ 2న సుల్తాన్ థియేటర్లలోకి రానుంది. 

Back to Top