కర్ఫ్యూ టైంలో వాకింగ్ పై డ్రోన్ల అవగాహన ప్రచారం
- March 25, 2021
కువైట్:కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు పాక్షిక కర్ఫ్యూను అమలులోకి తీసుకొచ్చిన కువైట్ ప్రభుత్వం..కర్ఫ్యూ సమయంలో సడలింపులు, పాటించాల్సిన నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రచారాన్ని చేపట్టింది. ఇందుకోసం డ్రోన్లను వినియోగిస్తోంది. కర్ఫ్యూ సమయం ప్రారంభమైన తొలి రెండు గంటలు ప్రజలు తమ నివాస ప్రాంగణాల్లో వాకింగ్ చేసుకోవచ్చని, అలాగే వ్యాయమం చేసుకునేందుకు కూడా అనుమతించిన విషయం తెలిసిందే. అయితే..ఈ వెసులుబాటు కేవలం వాకింగ్ కోసం మాత్రమేనని...వాహనాల్లో తిరిగేందుకు పర్మిషన్ లేదని కువైట్ స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని డ్రోన్ల సాయంతో ప్రచారం నిర్వహించనుంది. తొలుత సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల పాటు కర్ఫ్యూ విధించినా..ఆ తర్వాత కర్ఫ్యూ సమయాన్ని 11 గంటలకు కుదించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వాకింగ్ చేసుకోవచ్చు. ఇక రెస్టారెంట్ల డెలివరీ సర్వీస్ ను రాత్రి 10 గంటల వరకు కొనసాగించవచ్చు.
తాజా వార్తలు
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్
- రిపబ్లిక్ డే 2026: పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం..
- JEOగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ
- టీవీకే పార్టీ ఎన్నికల గుర్తు ‘విజిల్’ను ఆవిష్కరించిన విజయ్
- హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. కాలేజీ విద్యార్థులు అరెస్ట్
- తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!







