కియా మోటర్స్‌లో ఉద్యోగాలు...

- March 25, 2021 , by Maagulf
కియా మోటర్స్‌లో ఉద్యోగాలు...

ఏపీ:అనంతపురం జిల్లా పెనుగొండలోని కియా మోటార్స్ల్‌లో ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. ఈ ఖాళీల భర్తీకి సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ APSSDC ట్విట్టర్‌లో వెల్లడించింది. ఈ డ్రైవ్ ద్వారా ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తోంది కాయి మోటార్స్. మొత్తం 200 పోస్టులకు గాను ఫ్రెషర్స్‌తో పాటు అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకు అభ్యర్థులు హాజరు కావల్సిన వేదిక.. అవంతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, 3-4-875/A/1, చెరుకుపల్లి, తగరపు వలస బ్రిడ్జి దగ్గర, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్-500027. అభ్యర్థులు 2021 మార్చి 30న జరిగే ఆన్‌లైన్ ఎగ్జామ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

విద్యార్హతల వివరాలు చూస్తే ఏదైనా బ్రాంచ్‌లో డిప్లొమా పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. 2016 నుంచి 2020 మధ్య పాస్ అయిన అభ్యర్ధులే దరఖాస్తు చేయాలి. అభ్యర్ధుల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. కేవలం పురుషులు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఎంపికైన వారికి రూ.14,000 నుంచి రూ.15,000 వరకు వేతనం లభిస్తుంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభ్యర్థులు శ్రీకాకుళం జిల్లాలో జరిగే డ్రైవ్‌కు తూర్పుగోదావరి జిల్లా, విశాఖ పట్నం జిల్లాల అభ్యర్థులు విశాఖపట్నంలో జరిగే డ్రైవ్‌కు హాజరు కావాలి. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్http://https://www.apssdc.in/ లో తెలుసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com