'రంగ్ దే' మూవీ రివ్యూ

- March 26, 2021 , by Maagulf
\'రంగ్ దే\' మూవీ రివ్యూ

బ్యాన‌ర్‌: సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్

న‌టీన‌టులు:  నితిన్‌, కీర్తిసురేష్‌, న‌రేష్‌, కౌస‌ల్య‌, రోహిణి, బ్ర‌హ్మాజీ, అభిన‌వ్ గోమ‌టం, వెన్నెల కిషోర్‌, సుహాస్‌, వినీత్‌, స‌త్యం రాజేష్ త‌దిత‌రులు

దర్శ‌క‌త్వం:  వెంకీ అట్లూరి

నిర్మాత‌:  సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ

సినిమాటోగ్ర‌ఫీ:  పీసీ శ్రీరామ్‌

సంగీతం:  దేవిశ్రీ ప్ర‌సాద్‌

ఎడిటింగ్‌:  న‌వీన్ నూలి

విడుదల తేదీ: 26 మార్చి 2021

యువ హీరో నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా సినిమా రంగ్ దే.వెంకీ అట్లూరి దర్శకుడు.పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న రంగ్ దే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదలయ్యింది.

కథ:
అర్జున్‌(నితిన్‌), అనుపమ(కీర్తిసురేష్‌) పక్క పక్క ఇళ్లల్లో కలిసి పెరుగుతారు. చిన్నప్పట్నుంచి అర్జున్‌ అంటే అనుకు చాలా ఇష్టం.ఆ ఇష్టం పెద్దయ్యేసరికి ప్రేమగా మారుతుంది.అలాగే చిన్నప్పుడు అను అంటే అర్జున్‌కి క్రష్‌ ఉన్నప్పటికీ అనుని చూసి నేర్చుకో అంటూ తండ్రి అంటూ ఉండటంతో క్రష్‌ కాస్త కోపం..పెద్దయ్యేసరికి కోపం కాస్త ద్వేషంగా మారుతుంది. అయితే తండ్రిపై ఉన్న భయం, గౌరవంతో అను ముందు తన కోపాన్ని అర్జున్‌ వ్యక్తం చేయడు. అను, అర్జున్‌ ఇద్దరూ ఒకే కాలేజ్‌లో ఇంజనీరింగ్‌ పూర్తి చేస్తారు. పై చదువుల కోసం జీమేట్‌ ఎగ్జామ్‌ రాస్తారు.అను,అర్జున్‌ ఇద్దరూ ఒకే కాలేజీకి అప్లయ్‌ చేస్తారు. ఒకరు డ్రాప్‌ అయితేనే మరొకరికి ఆ కాలేజ్‌లో సీటు వస్తుందని తెలియడంతో అర్జున్‌.. అనుకి పెళ్లి చేసి  పంపేస్తే తనకు దుబాయ్‌ వెళ్లడానికి రూట్‌ క్లియర్‌ అవుతుందని భావించి ఓ చిన్న గేమ్‌ ఆడుతాడు. అయితే విషయం తెలుసుకున్న అను మరో ప్లాన్‌ వేస్తుంది. ఫిక్స్‌ అయిన పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకుని అర్జున్‌ని పెళ్లి చేసుకుంటుంది. దాంతో కథ మరో మలుపు తిరుగుతుంది.అర్జున్‌, అను విడిపోవాలనుకుంటారు.అసలు వాళ్లెందుకు ఆ నిర్ణయం తీసుకుంటారు? చివరకు అను ప్రేమను అర్జున్‌ అర్థం చేసుకుంటాడా?  లేదా? ఇద్దరూ ఒక్కటవుతారా? అనే విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

విశ్లేషణ: 
నితిన్‌ - కీర్తీ సురేష్‌ జంటగా రంగ్‌దే అనగానే మొదటి నుంచీ పాజిటివ్‌ వైబ్స్ ఉన్నాయి. దానికి తోడు టీజర్‌, ట్రైలర్లు కూడా సినిమా థీమ్‌ను ఎలివేట్‌ చేసేలాగా కట్‌ చేయడం బిగ్గెస్ట్ ప్లస్‌ అయింది.ఓ వైపు బస్టాండే బస్టాండే పాటతో అబ్బాయిల కష్టాలను చూపించి ఫ్యామిలీస్‌ని అట్రాక్ట్ చేశారు. మరోవైపు నరేష్ చేత చెప్పించిన డబుల్‌ మీనింగ్‌ డైలాగులు కూడా ఆడియన్స్ ని థియేటర్ల వైపు రప్పిస్తున్నాయి.లిమిటెడ్‌ ఆర్టిస్టులు, పక్కాగా రాసుకున్న స్క్రీన్‌ప్లే, పొందిగ్గా అల్లుకున్న సీన్స్, మంచి కామెడీ సెన్స్, టైమ్‌లీ సాంగ్స్ సినిమాకు ప్లస్‌ అయ్యాయి. కలిసి పెరిగిన ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్‌ ఏంటో అర్థం కాకపోవడం అనేది నువ్వే కావాలిలోనూ, అంతకు ముందు నుంచి కూడా ఉన్న థీమే. అలాగే దంపతుల మధ్య ఈగో క్లాషెస్‌, కేవలం కుటుంబ పెద్దల కోసం కలిసున్నట్టు కనిపించడం కూడా మనకు కొత్తేం కాదు. విడాకుల ప్రస్తావన ఉన్నా, విడాకులు తీసుకునే రోజుదాకా కలిసున్న కపుల్స్ కథలు కూడా కొత్త కాదు.
అయితే, అన్నీ పాత విషయాలను కలిపి కలర్‌ఫుల్ గా చూపించే ప్రయత్నం చేశారు వెంకీ అట్లూరి. అతనికంటూ ఉన్న ఫ్యామిలీ ప్లస్‌ సెంటిమెంట్‌, ప్లస్‌ యూత్‌ఫుల్‌నెస్‌ ప్లస్‌ క్రేజీ మార్క్ ఇందులోనూ కనిపించింది. దేవిశ్రీ ప్రసాద్‌ ట్యూన్స్ సినిమాకు హైలైట్‌. అన్నీ యూత్‌ మళ్లీ మళ్లీ పాడుకునేలాగానే ఉన్నాయి. వెన్నెల కిశోర్‌, బ్రహ్మాజీ కామెడీ మెప్పిస్తుంది. కీర్తీ సురేష్‌ కొన్నిచోట్ల బావున్నా, నవ్వినప్పుడు ఆర్టిఫిషియల్‌గా ఉంది. కానీ ప్రెగ్నెంట్‌ విమెన్‌గా కీర్తీ పెర్ఫార్మెన్స్ బావుంది. చాన్నాళ్ల తర్వాత వినీత్‌ తెలుగు స్క్రీన్‌ మీద కనిపించారు. కెమెరా సినిమాకు హైలైట్‌. రంగ్‌ దే అనే టైటిల్‌ని సపోర్ట్ చేసేలా ఉంది సినిమాటోగ్రఫీ. కీర్తీ సురేష్‌  సోలో ఫ్రేమ్స్ వచ్చిన ప్రతిసారీ స్క్రీన్‌ మీద ప్లెజెంట్‌ ఎక్స్ పోజర్‌ మంచి ఫీల్‌నిచ్చింది.

సినిమాలో కొన్ని డైలాగులు హార్ట్ టచింగ్‌గా ఉన్నాయి. ఇంకొన్ని సీన్స్ ని వెంకీ అట్లూరి డీల్‌ చేసిన విధానం బావుంది. డీఎస్‌పీ రీరికార్డింగ్‌ కూడా చాలా చోట్ల సీన్లకు ఎలివేషన్‌ తెచ్చింది. అభినవ్‌ గోమటం, సుహాస్‌ కామెడీ కూడా బావుంది.

చివరగా.. 'రంగ్ దే'... ఈ వీకెండ్ ఫ్యామిలీతో సరదాగా చూడదగ్గ సినిమా.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com