60 ఏళ్ళు పైబడిన వారికి వర్క్ పర్మిట్ రుసుము పెంపు
- March 26, 2021
కువైట్ సిటీ:పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్‌కి లేబర్ డిపార్టుమెంట్, ఓ ప్రపోజల్‌ని పంపింది. ఈ ప్రతిపాదన ప్రకారం యూనివర్సిటీ డిగ్రీ లేని 60 ఏళ్ళు పైబడిన వలసదారులకు వర్క్ పర్మిట్ రుసుము 100 కువైటీ దినార్స్ పెంచనున్నారు. ఒకవేళ ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే, యూనివర్సిటీ డిగ్రీ లేని 60 ఏళ్ళు పైబడిన వలసదారులు తమ వర్క్ పర్మిట్లను రెన్యువల్ చేయించుకోవడానికి వీలుంటుంది.ప్రస్తుతం ఈ విభాగంలోని వారికి వర్క్ పర్మిట్ రెన్యువల్ అనుమతి లేదు. మొదటి ఏడాదికి 100 కువైటీ దినార్లు, ఆ తర్వాతి ఏడాదికి రెండు రెట్లు రెన్యువల్ అమౌంట్ పెంచుకుంటూ వెళతారు. ప్రస్తుత రూల్ ప్రకారం వందలాది మంది వలసదారులు (60 ఏళ్ళు పైబడిన వయసున్నవారు) తమ రెసిడెన్స్ని ఆర్టికల్ 22 నుంచి ఆర్టికల్ 24కి మార్చుకున్నారు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







