వకీల్ సాబ్ ట్రైలర్..ఫాన్స్ కు మాంచి గిఫ్ట్
- March 29, 2021
సుదీర్ఘ విరామం తరవాత పవన్ చేస్తున్న సినిమా 'వకీల్ సాబ్'. కాబట్టి అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఏప్రిల్ 9న విడుదల చేస్తున్నారు. ఈరోజు ట్రైలర్ విడుదలయ్యింది. అందులో కోర్టు హాలులో పవన్ కల్యాణ్ విజృంభణ కనిపించింది. మీరు వర్జినా.. అని అమ్మాయిలను అడగొచ్చు.. మేం అబ్బాయిలను అడగొద్దా’ అంటూ కోర్టులో పవర్‌స్టార్ గర్జిస్తూ కనిపించాడు. ఆయా సన్నివేశాలు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు తప్పకుండా నచ్చుతాయనిపిస్తోంది. బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన 'పింక్' కి రీమేక్ ఇది. అమితాబ్ పాత్రలో పవన్ ఎంత వరకూ న్యాయం చేస్తాడు? అనే సందేహాలు ట్రైలర్ తో పటాపంచలైపోయాయి. అమితాబ్ ని ఎక్కడా ఫాలో అవ్వకుండా, తనదైన ముద్ర వేయడానికి పవన్ ప్రయత్నించాడు.
అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల కీలక పాత్రధారులుగా నటించారు. ఓ కేసులో నలిగిపోతున్న ఈ ముగ్గురు అమ్మాయిల్ని వకీల్ సాబ్ ఎలా కాపాడాడు? అనేది తెరపై చూడొచ్చు. తమన్ బీజియమ్స్, పవన్ కల్యాణ్ ఎలివేషన్లూ అదిరిపోయాయి. అయితే శ్రుతిహాసన్ ఎక్కడా కనిపించలేదు. థియేటర్లోనే తనని చూడాలేమో..? మొత్తానికి పింక్ రీమేక్ ని పవన్ క్రేజ్‌కి తగినట్టు మార్పులు చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా
- వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!









