కరాచి హల్వా
- February 29, 2016కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ - రెండు కప్పులు, నెయ్యి - ఒక కప్పు, పంచదార - ఒక కప్పున్నర, జీడిపప్పు - పావుకప్పు, బాదంపప్పు - పావు కప్పు, కుంకుమ పప్పు - రెండు టీ స్పూన్లు, ఎసెన్స్ - ఒక టీ స్పూను, నీళ్లు - పావు కప్పు.
తయారుచేయు విధానం: స్టౌ మీద గిన్నె పెట్టి ఒక టేబుల్ స్పూను నెయ్యిలో రవ్వ వేసి వేగించుకోవాలి. తరువాత మరో గిన్నె పెట్టి మరో టేబుల్ స్పూను నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పప్పుని కూడా వేగించాలి. వీటిని తీసేసి అందులో పంచదార వేసి నీళ్లు పోసి బాగా మరిగించాలి. పాకం చిక్క పడకముందే మిగిలిన నెయ్యి, రవ్వ, కుంకుమ పువ్వు వేసి గరిటతో బాగా కలపాలి. జీడిపప్పు, బాదం పప్పు, ఎసెన్స్ కూడా వేసి కలిపాక ఒక ప్లేటుపై వేసుకోవాలి. మనకు నచ్చిన సైజుల్లో ముక్కలు కట్‌చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి