ఆదాయపు పన్ను రూమర్లపై స్పందించిన ఒమన్
- March 30, 2021
ఒమన్: సోషల్ మీడియా వేదికగా ఆదాయపు పన్ను విషయమై జరుగుతున్న దుష్ప్రచారంపై ఒమన్ స్పందించింది. అత్యధిక ఆదాయాన్ని ఆర్జించేవారిపై అదనపు పన్నుల భారం 2022 నుంచి మోపబోతున్నట్లు ప్రచారం జరుగుతుండడాన్ని ఒమన్ ఖండించింది. ఆదాయపు పన్నుని జీసీసీ దేశాల్లో ఎవరూ ఆదాయపు పన్ను వసూలు చేయడంలేదు. వ్యక్తిగత ఆదాయంపై ఒమన్ పన్నులు వసూలు చేయడంలేదనీ, క్యాపిటల్ గెయిన్స్, వెల్త్, డెత్ ఆఫ్ ప్రాపర్టీ, నాన్ రెసిడెంట్ ఇండివిడ్యువల్స్ (10 శాతం ట్యాక్స్ కొన్ని పరిమితులకు లోబడి) వంటి విభాగాల్లోనూ పన్నులు లేవని అధికారులు వివరించారు. సంస్థలు, ొమన్ కంపెనీలు సహా పలు విభాగాలపై 15 శాతం ట్యాక్స్ విధిస్తున్నారు. చిన్న పన్ను చెల్లింపుదారులకు 3 శాతం ట్యాక్స్ లేదా పూర్తిగా ట్యాక్స్ లేకపోవడం కూడా వుంది. పెట్రోలియం ఆపరేషన్స్ సంస్థలకు 55 శాతం ట్యాక్స్ వుంటుంది. పుకార్లను ఎవరూ నమ్మరాదని, అధికారిక వేదికల నుంచే సరైన సమాచారం అందుతుందని అథారిటీస్ స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!
- ఖతార్ లో గ్లోబర్ డొమెస్టిక్ మినిమం ట్యాక్స్ కు సవరణలు..!!
- ఐరన్‌మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్.. పాక్షిక ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఏపీ: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
- ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ తారిఖ్ రహ్మాన్ ప్రకటన
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- సిత్రాలోని ఐన్ అల్ రహా సిఫార్సుకు కౌన్సిల్ ఆమోదం..!!









