హరి హర వీరమల్లు చిత్రంలో పవర్ ఫుల్ స్టంట్
- March 30, 2021వకీల్ సాబ్ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు అనే చిత్రం చేస్తుండగా, ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో పవన్ కళ్యాణ్ లుక్ ఫ్యాన్స్ అంచనాలను అమాంతం పెంచేసింది. తొలిసారి పవన్ పీరియాడికల్ మూవీ చేస్తున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈ సినిమాపైనే ఉంది.
పాన్ ఇండియా సినిమాగా హరి హర వీరమల్లు అనే చిత్రాన్ని క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీ షూటింగ్ శరవేంగంగా జరుగుతుంది. “ధూమ్ 3”, “క్రిష్ 3” అలాగే అనేక పీరియాడిక్ సినిమాలకు స్టంట్ కొరియోగ్రఫీ చేసిన శామ్ కౌశల్.. ఇప్పుడు ఈ సినిమా కోసం సూపర్ స్టంట్స్ చేయిస్తున్నారు. తాజాగా క్రిష్ తన ట్విట్టర్ ద్వారా పవర్ స్టార్ కోసం కౌశల్ .. హై ఆక్టేన్ స్టంట్ చేయించారని పేర్కొన్నాడు. ప్రతిష్టాత్మకంగా భారీ గ్రాఫిక్స్ తో విజువల్ వండర్‌గా క్రిష్ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!