తగలబెట్టిన కేసులో ముగ్గురికి జైలు శిక్ష

తగలబెట్టిన కేసులో ముగ్గురికి జైలు శిక్ష

2014 ఆగస్ట్‌ 14వ తేదీన ఇంటీరియర్‌ మినిస్ట్రీ పెట్రోల్‌ కార్‌ని సనద్‌లోని అల్‌ ఘాదీర్‌ మాస్క్‌ ఎదురుగా పార్క్‌ చేసి ఉన్న సమయంలో తగలబెట్టిన కేసులో ముగ్గురికి 15 ఏళ్ళపాటు జైలు శిక్ష విధించింది హై క్రిమినల్‌ కోర్ట్‌. అడ్వొకేట్‌ జనరల్‌, చీఫ్‌ ఆఫ్‌ యాంటీ టెర్రర్‌ క్రైమ్‌ ప్రాసిక్యూషన్‌ అహ్మద్‌ అల్‌ హమ్మాదీ ఈ విషయాన్ని ధృవీకరించారు. శుక్రవారం పవిత్ర ప్రార్ధనల సందర్భంగా ఈ ఘాతుకానికి తెగబడ్డారు ముగ్గురు వ్యక్తులు. విచారణ సందర్భంగా నేరారోపణకు సంబంధించిన ఆధారాల్ని ప్రవేశపెట్టడం జరిగిందని అల్‌ హమ్మాదీ చెప్పారు. 

Back to Top