పబ్లిక్ ఉద్యోగాలు కేవలం సిటిజెన్స్‌కి మాత్రమే: ఎంపీలు
- February 29, 2016వలసదారులెవరూ ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం దక్కించుకోలేరని ఎంపీలు స్పష్టం చేశారు. పబ్లిక్ సెక్టార్‌లో బహ్రెయినీలకు మరిన్ని ఉద్యోగాలు కల్పించే దిశగా ఓ ప్రపోజల్‌ని ఎంపీ జమీలా అల్ సమ్మక్ మరియు మరో నలుగురు ఎంపీలు అందజేశారు. నెల రోజుల క్రితమే ప్రభుత్వ సెక్టార్‌లో పనిచేస్తున్న 50 శాతం మంది నాన్ బహ్రెయినీలకు ఉద్వాసన పలుకుతూ నిర్ణయం తీసుకోగా, దాని తర్వాత బహ్రెయినీ పౌరుల కోసం తీసుకున్న తాజా చర్యగా దీనిని అభివర్ణించవచ్చు. బహ్రెయినీలకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగావకాశాల్ని పెంచేందుకు తీసుకుంటున్న చర్యలో ఇది కూడా ఓ భాగమని ఎంపీలు చెప్పారు. గడచిన మూడేళ్ళలో సుమారు 2500 మంది వలసదారులు బహ్రెయిన్ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందారు. వారందర్నీ వెనక్కి పంపి, వారి స్థాయిలో బహ్రెయినీలకు అవకాశం కల్పించాల్సి ఉందని ఎంపీ ఖాదీమ్ చెప్పారు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే నాన్ బహ్రెయినీలకు అవకాశం కల్పించాలని నిబంధనలు చెబుతున్నాయి. ఓ ఉద్యోగానికి బహ్రెయినీ యువకులెవరూ పోటీ లేనప్పుడే వలసదారులకు అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







