మాజీ ప్రధాని దేవేగౌడ దంపతులకు కరోనా పాజిటివ్‌

- March 31, 2021 , by Maagulf
మాజీ ప్రధాని దేవేగౌడ దంపతులకు కరోనా పాజిటివ్‌

బెంగళూరు: మాజీ ప్రధాని దేవేగౌడతో పాటు ఆయన సతీమణి చెన్నమ్మ కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలారు. ఈ విషయాన్ని మాజీ ప్రధాని బుధవారం ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. మహమ్మారి బారినపడడంతో కుటుంబ సభ్యులంతా స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా తమను కలిసిన వారంతా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు భయపడొద్దని సూచించారు. మాజీ ప్రధానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని కర్ణాటక వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ పేర్కొన్నారు. వ్యక్తిగతంగా వైద్యులను సంప్రదించి, ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తానన్నారు. ఆయన, చెన్నమ్మ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com