మాజీ ప్రధాని దేవేగౌడ దంపతులకు కరోనా పాజిటివ్
- March 31, 2021
బెంగళూరు: మాజీ ప్రధాని దేవేగౌడతో పాటు ఆయన సతీమణి చెన్నమ్మ కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలారు. ఈ విషయాన్ని మాజీ ప్రధాని బుధవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. మహమ్మారి బారినపడడంతో కుటుంబ సభ్యులంతా స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా తమను కలిసిన వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు భయపడొద్దని సూచించారు. మాజీ ప్రధానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని కర్ణాటక వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ పేర్కొన్నారు. వ్యక్తిగతంగా వైద్యులను సంప్రదించి, ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తానన్నారు. ఆయన, చెన్నమ్మ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్‌కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్‌ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









