రూ.254 కోట్లు విడుదల చేసిన సీఎం జగన్
- March 31, 2021
అమరావతి:వైఎస్సార్ బీమా పథకాన్ని 2020 అక్టోబర్ 21వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే.నాటి నుంచి ఇప్పటి వరకు పథకం పరిధిలోకి వచ్చే చనిపోయిన కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో 1239 మంది వ్యక్తుల కుటుంబ సభ్యుల ఖాతాల్లో 254 కోట్ల రూపాయల నిధులు జమ అయ్యాయి.

ఈ సందర్భంగా నిర్వహించిన వీడియా కాన్ఫరెన్స్లో జిల్లాల నుంచి స్థానిక మంత్రులు, ఎమ్పీలు, ఎమ్మెల్యేలు, నేతలు లబ్దిదారులతో పాటు పాల్గొన్నారు. 18 నుంచి 50 ఏళ్ళ వయస్సులో మధ్యలో ఉండి సహజ మరణానికి రూ.2లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే, శాశ్వత అంగవైకల్యానికి ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. ప్రీమియం డబ్బులు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. 51 నుంచి 70 ఏళ్ల వయస్సు ఉన్న వారికి ప్రభుత్వం రూ.3లక్షలు , పాక్షిక అంగవైకల్యానికి లక్షన్నర బీమా సౌకర్యం కల్పిస్తుంది.
అర్హత ఉన్నా బ్యాంకుల్లో నమోదు కాని కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎమ్ జగన్ భరోసా చేశారు. ఏటా రూ.510 కోట్లతో కోటి 41 లక్షల కుటుంబాలకు ఉచిత బీమా ఇస్తున్నామన్నారు. గతంలో కేంద్రం PMJJBY, PMSBY పథకాల కింద బీమా ప్రీమియంలో 50 శాతం వాటా ఇచ్చేది. గత ఏడాది మార్చి 31 నుంచి ప్రీమియం కట్టే విధానానికి కేంద్రం నిలిపివేసింది.దీనితో పాటు గ్రూపు ఇన్సూరెన్స్ విధానాన్ని వ్యక్తిగత ఖాతాల కింద మార్పు చేయాలనే నిబంధన పెట్టింది.అంతే కాకుండా 45 రోజులు కూల్ ఆఫ్ పీరియడ్ విధానాన్ని ప్రవేశపెట్టింది.దీని ప్రకారం ఈ 45 రోజుల వ్యవధిలో ఎవరైనా చనిపోయినా బీమా అందే అవకాశం ఉండదు.

కేంద్రం వైపు నుంచి ఇన్ని సమస్యలు ఉన్నా...రాష్ట్రం ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రీమియం కట్టడం నుంచి నిబంధనల సడలింపు వరకు అన్ని అంశాలను మానవతా దృక్పథంతో చేపట్టామని సీఎం జగన్ అన్నారు. ఇటువంటి సందర్భాల్లో ఏ రకంగా ప్రజలను ఆదుకునే అవకాశం ఉంటుందో మేథోమథనం చేసి పరిష్కారాలతో వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు జగన్. మరోవైపు ఈ పథకం కోసం చేపట్టిన సర్వేలో అర్హులుగా గుర్తించినప్పటికీ, పేర్లు నమోదు చేసుకోకముందే మరణించిన వారి కుటుంబాలకు కూడా బీమా సొమ్మును ప్రభుత్వం చెల్లించాలని నిర్ణయించింది. గ్రామ వాలంటీర్ల సహకారంతో 61 లక్షల బ్యాంకు ఖాతాలను రాష్ట్రంలో తెరిచినట్లు సీఎమ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









