హైదరాబాద్-హుబ్లీ విమాన సర్వీసులను పున:ప్రారంభం
- March 31, 2021
హైదరాబాద్:జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (GHIAL), నేడు హైదరాబాద్-హుబ్లి మధ్య అలయెన్స్ ఎయిర్ విమాన సర్వీసును పున:ప్రారంభించింది. విమానాశ్రయ అధికారులు, ఇతర భాగస్వాముల సమక్షంలో అలయెన్స్ ఎయిర్ విమానం హైదరాబాద్ నుండి ఉదయం 06.35 గంటలకు బయలుదేరింది. ఈ సర్వీసుతో హైదరాబాద్ నుండి దేశీయ గమ్యస్థానాల సంఖ్య 57 కి చేరుకుంది.
అలయెన్స్ ఎయిర్ ఈ సెక్టార్‌కు 70 సీట్ల ATR 72 600 ని కేటాయించింది. ఫ్లైట్ నెంబర్ 9I 879 హైదరాబాద్ నుండి 06.25 గంటలకు బయలుదేరి హుబ్లికి 08.00 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఫ్లైట్ నెంబర్ 9I 880 హుబ్లి నుండి 08.25 గంటలకు బయలుదేరి 09.55 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ విమాన సర్వీసు వారానికి మూడుసార్లు - సోమవారం, బుధవారం మరియు శుక్రవారం నడుస్తుంది.
జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సీఈఓ శ్రీ ప్రదీప్ పణికర్ “హైదరాబాద్ మరోసారి హుబ్లితో అనుసంధానమైనందుకు మేము సంతోషిస్తున్నాము. ఈ సర్వీసు పున:ప్రారంభం ప్రయాణీకుల విశ్వాసం క్రమంగా పెరుగుతోందని తెలియజేస్తోంది. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సన్నద్ధంగా ఉంది. టైర్-2, టైర్-3 నగరాలకు విమాన కనెక్టివిటీని పెంచడానికి భారత ప్రభుత్వం ప్రాంతీయ కనెక్టివిటీ పథకం ఉడాన్ (ఉదే దేశ్ కా ఆమ్ నాగరిక్) కింద ప్రారంభించిన ఈ సేవలు మెట్రోలతో కనెక్టివిటీని తిరిగి స్థాపించడంలో చాలా కీలకమైనవి.” అన్నారు.
అలయెన్స్ ఎయిర్ సీఈఓ హర్ ప్రీత్ ఏ డే సింగ్ మాట్లాడుతూ, ‘‘ఈ సర్వీసు హైదరాబాద్, హుబ్లీల మధ్య ప్రయాణాన్ని ఎలాంటి ఆటంకాలూ లేకుండా, వేగవంతం చేస్తుంది. ప్రత్యేకమైన సవాళ్లను అధిగమిస్తూ అలయెన్స్ ఎయిర్ ప్రత్యేకమైన రూట్లు, ప్రత్యేకమైన గమ్యస్థానాలతో దేశవ్యాప్తంగా ప్రజల హృదయాలను ఏకం చేస్తుంది. ఉడే భారత్, జుడే భారత్, ఆత్మనిర్భర్ బనే భారత్’’’ అన్నారు.
హైదరాబాద్ దక్షిణ, మధ్య భారతదేశానికి ప్రవేశ ద్వారంలాంటిది. ఇది సమీపంలోని విజయవాడ, విశాఖపట్నం, నాగ్‌పూర్, రాజమండ్రి, తిరుపతి మరియు బీదర్ నగరాల నుండి వచ్చే ప్రయాణీకులకు అనుకూలంగా ఉండే విమానాశ్రయం. ఇటీవల, ప్రయాణీకుల కోరిక మేరకు జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చికాగోకు నాన్-స్టాప్ ఫ్లైట్ సర్వీసును మరియు మాల్దీవులోని మాలెకు ప్రత్యక్ష విమాన సేవలను ప్రారంభించింది.
అలయన్స్ ఎయిర్, ఎయిర్ ఇండియా యాజమాన్యం కింద నిర్వహించబడుతున్న సంస్థ. హైదరాబాద్ - హుబ్లి విమాన సర్వీసు భారత ప్రభుత్వం ఉడాన్ పథకం కింద ప్రవేశపెట్టిన రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ విమానం.
హుబ్బళ్లి అని కూడా పిలిచే హుబ్లి కర్ణాటక రాష్ట్రంలోని ఒక నగరం. జంట నగరాలు హుబ్లి-ధార్వాడ్లు బెంగళూరు మరియు మైసూర్ తరువాత రాష్ట్రంలో మూడవ అతిపెద్ద పట్టణ సముదాయం. 2017 లో, భారత ప్రభుత్వం హుబ్లి-ధార్వాడ్ జంట నగరాలను ప్రతిష్టాత్మక ‘స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్’లో చేర్చింది.
తాజా వార్తలు
- 1.6 మిలియన్ల మందికి ఉచిత ఇఫ్తార్ మీల్స్..!!
- అక్రమ చేపల వేట, ఆఫీసర్ పై దాడి..ముగ్గురు అరెస్టు..!!
- యూకే యువరాజు విలియంకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ స్వాగతం..!!
- రమదాన్ లో గ్రీన్ బహ్రెయిన్ కు మద్దతు..!!
- మస్కట్‌లో డ్రాగన్ ఆటో ఫెస్ట్ 2026..!!
- OTM ముంబై 2026.. విజిల్ ఖతార్..!!
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక









