కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగలేదని : ముఖ్యమంత్రి

- February 29, 2016 , by Maagulf
కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగలేదని : ముఖ్యమంత్రి

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలో జరుగుతున్న టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో మాట్లాడానని, ఈ ఏడాది పెండింగ్‌ ప్రాజెక్టులపై స్పష్టత ఇస్తామని చెప్పారన్నారు. అదే విధంగా బడ్జెట్‌లో రాష్ట్రాల వారీగా కాకుండా... రంగాల వారిగా కేటాయింపులు చేసినట్లు ఆర్థిక మంత్రి తెలిపినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్రం నుంచి నిధుల కోసం ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నట్లు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com