సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్..నాణ్యత లోపం..కోటిన్నర డోసుల వృధా..

- April 01, 2021 , by Maagulf
సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్..నాణ్యత లోపం..కోటిన్నర డోసుల వృధా..

న్యూయార్క్‌: ఒకే డోసుతో కరోనాకు చెక్ పెట్టేలా జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ది చేసిన కరోనా వ్యాక్సిన్‌కు పెద్ద దెబ్బ పడింది. ఆ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్న సంస్థ ఎమర్జెంట్ బయో సొల్యూషన్స్ నాణ్యతా ప్రమాణాలు పాటించకోవడం వల్ల ఏకంగా కోటిన్నర డోసుల వ్యాక్సిన్ వృథా అయినట్లు న్యూయార్స్ టైమ్స్ వెల్లడించింది. ఈ విషయాన్ని జాన్సన్ అండ్ జాన్సన్ ధృవీకరించినా.. కచ్చితంగా ఎన్ని డోసులు వృథా అయ్యాయో మాత్రం చెప్పలేదు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఓ బ్యాచ్ డోసులు మొత్తం వృథా అయ్యాయని ఆ సంస్థ చెప్పింది.

అసలు ఈ వ్యాక్సిన్లను ఫిల్లింగ్ స్టేజీకి కూడా తీసుకెళ్లలేదని తెలిపింది. నాణ్యత, భద్రతే తమ ప్రాధాన్యాలని జాన్సన్ అండ్ జాన్సన్ తేల్చి చెప్పింది. అయితే సాధ్యమైనంత త్వరగా తమ సింగిల్ డోస్ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్న ఆ సంస్థకు ఈ వృథా పెద్ద దెబ్బే వేసింది. అటు అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ వృథాపై విచారణ జరపడానికి సిద్ధమవుతోంది. జాన్సన్ అండ్ జాన్సన్ కూడా మరింత మంది నిపుణులను విచారణ కోసం ఎమర్జెంట్ సంస్థ దగ్గరకి పంపిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com