కోవిడ్ పిసిఆర్ టెస్ట్ - పరస్పర సహకారరం అభినందనీయం

- April 01, 2021 , by Maagulf
కోవిడ్ పిసిఆర్ టెస్ట్ - పరస్పర సహకారరం అభినందనీయం

అబుధాబి: కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో అబుధాబి రెసిడెంట్స్, కరోనా పిసిఆర్ టెస్టులు చేయించుకునే క్రమంలో ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటున్నారు. అబుదాబీలో మాస్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ద్వారా అందరికీ కరోనా టెస్టులు చేయిస్తున్నారు. జూన్ 2020న ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికల ద్వారా పంచుకుంటున్నారు అబుధాబి రెసిడెంట్స్. కీలకమైన విభాగాల్లో పనిచేసేవారు వారానికి ఓ సారి కరోనా టెస్ట్ చేసుకోవాల్సి వుంటోంది. ఈ నేపథ్యంలో కరోనా పిసిఆర్ టెస్టుల నిర్వహణ అనేది అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియగా  మారింది. కరోనా టెస్టులు ఎక్కడ నిర్వహిస్తున్నారనే అంశాలతోపాటు, కరోనా జాగ్రత్తల గురించి కూడా సోషల్ మీడియాలో విలువైన సమాచారం దొరుకుతోందని అబుధాబి రెసిడెంట్స్ చెబుతున్నారు.

--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com