నా అవార్డు ఆ బస్సు డ్రైవర్ కు అంకితం: రజినీకాంత్
- April 01, 2021
చెన్నై: భారతీయ చలన చిత్ర పరిశ్రమలో విశేషంగా చెప్పుకునే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తనని వరించడం పై సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ తన ప్రయాణంలో తోడుగా సాగిన ప్రతిఒక్కరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా రజనీ ఓ ట్వీట్ చేశారు.
'సినిమా రంగంలో అత్యంత విలువైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ప్రకాశ్ జావడేకర్, ఇతర జ్యూరీ సభ్యులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాలోని నటుడ్ని గుర్తించి నన్ను ఎంతగానో ప్రోత్సహించిన బస్సు డ్రైవర్, నా స్నేహితుడు రాజ్ బహదూర్, పేదరికంలో ఉన్నప్పటికీ నన్ను నటుడ్ని చేయడం కోసం ఎన్నో త్యాగాలు చేసిన నా పెద్దన్నయ్య సత్యనారాయణరావు గైక్వాడ్, అలాగే ఈ రజనీకాంత్‌ను సృష్టించిన నా గురువు బాలచందర్‌తోపాటు.. నాకు జీవితాన్ని ఇచ్చిన నిర్మాతలు, దర్శకులు, డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ యజమానులు, మీడియా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వన్, ప్రతిపక్ష పార్టీ నేత స్టాలిన్, కమల్‌హాసన్‌తోపాటు ఇతర రాజకీయ, సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులందరికీ నా కృతజ్ఞతలు. జైహింద్!!'' అని రజనీ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







