GHMC కీలక నిర్ణయాలు..
- April 01, 2021
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో భారీ సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి.. ఇక, ఆది నుంచి కోవిడ్ కేసులకు హైదరాబాద్ హాట్ స్పాట్‌గానే ఉంది.. కోవిడ్ సెకండ్ వేవ్‌లోనూ గ్రేటర్ పరిధిలో కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.. అయితే, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)... బహిరంగ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరిగా ధరించాల్సిందేనని స్పష్టం చేసింది.. పబ్లిక్ ప్లేసుల్లో ఎవ్వరూ గుమ్మిగూడవద్దని సూచించిన GHMC.. 6 అడుగుల దూరం పాటించాలని ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో ఎవ్వరూ ఉమ్మకూడదు స్పష్టం చేసిన అధికారులు..ఒకవేళ ఉమ్మితే ఫైన్ విధిస్తామని ప్రకటించారు. మాస్కు లేక పోతే ఉద్యోగులు అయినాసారే GHMC ఆఫీసులోకి అనుమతి లేదని పేర్కొన్నారు. అంతేకాదు.. సిబ్బంది ఆఫీస్ లోపలికి వచ్చినప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు కూడా చేతులు శానిటేషన్ చేసుకోవాలని స్పష్టం చేసింది GHMC. కాగా, ఇప్పటికే, GHMC కార్యాలయాల్లో సందర్శకులకు నో ఎంట్రీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఒమన్‌లో 8 మిలియన్లు దాటిన మొబైల్ సర్వీస్ సబ్స్క్రిప్షన్లు..!!
- బహ్రెయిన్ -యూఏఈ మధ్య వ్యూహాత్మక ఆర్థిక చర్చలు..!!
- ప్రైవేట్ వాహనాలను టాక్సీలుగా ఉపయోగించడంపై ఖతార్ హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 11,656 మందిపై బహిష్కరణ వేటు..!!
- డ్రగ్స్ వ్యతిరేక కార్యకలాపాలలో 16 మంది అరెస్ట్..!!
- లక్కీ డే డ్రా.. Dh100,000 చొప్పు గెలుచుకున్న నలుగురు ప్లేయర్స్..!!
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం









