రమదాన్: ప్రొఫెట్ మసీదులోకి చిన్నారులకు అనుమతి లేదు
- April 02, 2021
సౌదీ: 15 ఏళ్ళ వయసులోపు చిన్నారులకు రమదాన్ సందర్భంగా ప్రొఫెట్ మసీదులోకి అనుమతి లేదని మసీదు జనరల్ ప్రెసిడెన్సీ స్పష్టం చేసింది. కరోనా పాండమిక్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జనరల్ ప్రెసిడెన్సీ ఫర్ ది ఎఫైర్స్ ఆఫ్ ప్రొఫెట్ మాస్క్ (మసీదు), తరావీహ్ ప్రార్థనల సమయాన్ని సగానికి తగ్గించింది. తరావీహ్ ప్రార్థనల తర్వాత 30 నిమిషాల అనంతరం మసీదుని మూసివేస్తారు. ఇతికాఫ్ (మసీదులో కొన్ని రోజులు వుండడం) కూడా నిషేధించింది. మాస్కు వద్ద ఉపవాస దీక్షల విరమణ చేసేవారికి నీరు, పండ్లు అందించబడతాయి. అయితే, వాటిని ఇతరులతో పంచుకోవడం నిషేధం. ఎక్కువమంది గుమికూడటాన్నీ నిషేధించారు. సహూర్ మీల్స్ పంపిణీ కూడా మసీదు కోర్టు యార్డు పరిధిలో అనుమతించరు. నేషనల్ పార్కింగ్ యాప్ మావ్కిఫ్ వినియోగించాలని వర్షిపర్స్ కి సూచించింది అథారిటీ.
--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)
తాజా వార్తలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్







