"మేము" మార్చి 18న
- March 01, 2016
సూపర్ స్టార్ సూర్య-అమలాపాల్-బిందుమాధవి నటించగా తమిళంలో ఘన విజయం సాధించిన "పసంగ-2" తెలుగులో "మేము" పేరుతో అనువాధమవుతుండడం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు పాండిరాజ్ రూపొందించిన ఈ చిత్రాన్ని "స్టూడియో గ్రీన్ జ్ఞాన్ వేల్ రాజాతో కలిసి.. తన సొంత నిర్మాణ సంస్థ "2 డి ఎంటర్ టైన్మెంట్స్" పతాకంపై.. తెలుగులో హీరో సూర్య స్వయంగా సమర్పిస్తుండడం విశేషం. సాయి మణికంఠ క్రియేషన్స్ పతాకంపై జూలకంటి మధుసూదన్ రెడ్డి నిర్మిస్తున్న "మేము" చిత్రం మార్చి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా జూలకంటి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ. "సూపర్ స్టార్ సూర్య, స్టూడియో గ్రీన్ జ్ఞాన్ వేల్ రాజాల సంయుక్త సమర్పణలో "మేము" చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది.ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలతో కలిసి కచ్చితంగా చూసి తీరాల్సిన సినిమా "పసంగ 2" అని తమిళ మీడియాతో పాటు ఇంగ్లీష్ మీడియా సైతం తీర్మానించిన గొప్ప సినిమా ఇది. ఈ సినిమాకి వచ్చినన్ని మంచి రివ్యూలు, రేటింగ్స్ ఈ మధ్య కాలంలో మరే సినిమాకు రాలేదు. తమిళంలో ఈ చిత్రాన్ని సూర్య నిర్మించారు. వరుస విజయాలతో తమిళంలో సంచలన దర్శకుడిగా పేరు
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







