కర్ణాటకలో సంచలనం రేపుతున్న డ్రగ్స్ రాకెట్..
- April 03, 2021
బెంగళూరు:కర్ణాటకలో సంచలనం రేపుతున్న డ్రగ్స్ రాకెట్.. తెలంగాణలోను కుదిపేస్తోంది. డ్రగ్స్ కేసులో తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారని బెంగళూరు పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. తెలంగాణ ఎమ్మెల్యేల ప్రమేయంపై బెంగళూరు పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరిలో ఇప్పటికే ఒక ఎమ్మెల్యే పేరును నిర్ధారణ కాగా.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ యంగ్ హీరో కూడా ఉన్నాడని బెంగళూరు పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. రెండు రాష్ట్రాలను కుదిపేస్తున్న ఈ డ్రగ్స్ రాకెట్ ఇపుడు అటు కర్ణాటకలోను.. ఇటు తెలంగాణలోను హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ ఉద్యమకారుడినంటూ చెప్పుకుని డ్రగ్స్ సరఫరా చేసింది ఎవరు..? తెలంగాణకు చెందిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరనేది ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
ఫిబ్రవరి 26న బెంగళూరు తూర్పు డివిజన్ పోలీసులు నవగరా సర్వీసు రోడ్డులో నైజీరియా ముఠా గుట్టును రట్టు చేశారు. కన్నడ సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసేందుకు వచ్చిన నైజీరియాకు చెందిన హారిసన్, జాన్ నాన్సోలను పట్టుకున్నారు. వారి నుంచి కోట్లు విలువైన భారీ మత్తు పదార్ధాలను స్వాధీనం చేసుకున్న ముఠా వద్ద బెంగళూరు పోలీసులకు తీగలాగితే అసలు డ్రగ్స్ డొంక కదిలింది. తెలంగాణలోని ముగ్గురు ఎమ్మెల్యేలకు డ్రగ్స్ కేసులో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారుడినంటూ చెప్పుకునే వ్యక్తి తెలంగాణ ఎమ్మెల్యేలకు మత్తు పదార్థాలు సరఫరా చేసినట్లు బెంగళూరు పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు.
తాజా వార్తలు
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!
- బహ్రెయిన్ లో రమదాన్ మద్దతుకు ఎంపీల ప్రతిపాదన..!!
- కువైట్ లో స్మార్ట్ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టం అమలు..!!
- రుస్తాక్ వింటర్ ఫెస్టివల్ 2026 ప్రారంభం..!!
- ద్వైపాక్షిక సంబంధాలు.. సౌదీ క్రౌన్ ప్రిన్స్, పుతిన్ చర్చలు..!!
- రమదాన్ కంటే ముందే పరీక్షల షెడ్యూల్ సర్దుబాటు..!!
- స్కూల్ పిల్లలకు ఉచితంగా ఆధార్ క్యాంపులు
- ముంచెత్తిన తీవ్ర హిమపాతం..35 మంది మృతి
- భారత్‌లో గూగుల్ మెగా ప్లాన్..20 వేల ఉద్యోగాలు రెడీ







