భారత్‌లో కరోనా కేసుల వివరాలు
- April 05, 2021
న్యూ ఢిల్లీ:భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది.కరోనా ఫస్ట్ వేవ్ కంటే తీవ్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నట్టుగానే పరిస్థితి ఉంది.ఫస్ట్ వేవ్‌లో కేసులు భారీ సంఖ్యలో నమోదు అయినా.. లక్ష దాటింది లేదు..కానీ, ఆ రికార్డును బ్రేక్ చేసిన సెకండ్ వేవ్... కొత్త రికార్డులను సృష్టిస్తూ.. లక్షకు పైడా పాజిటివ్ కేసులు నమోదు చేసింది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 1,03,558 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.కరోనా బారిన పడి 478 మంది మృతిచెందారు.. ఇదే సమయంలో 52,847 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం ప్రకటించింది.ఇక, మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,25,89,067కు చేరుకోగా... ఇప్పటి వరకు 1,16,82,136 మంది కరోనాబారినపడి కోలుకున్నారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,41,830 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు కోవిడ్‌తో మృతిచెందినవారి సంఖ్య 1,65,101కు పెరిగింది.. మరోవైపు.. వ్యాక్సినేషన్ కూడా కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు 7,91,05,163 మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయినట్టు కేంద్రం పేర్కొంది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







