కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన: 100 ఔట్ లెట్ల మూసివేత

- April 05, 2021 , by Maagulf
కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన: 100 ఔట్ లెట్ల మూసివేత

జెడ్డా: జెడ్డా గవర్నరేట్ మునిసిపాలిటీ, సంబంధిత సబ్ మునిసిపాలిటీలు, 98 కమర్షియల్ ఔట్ లెట్లను మూసివేయడం జరిగింది. కోవిడ్ 19 హెల్త్ ప్రోటోకాల్స్ ఉల్లంఘనకు ఈ సంస్థలు పాల్పడినట్లు నిర్ధారించారు. మొత్తం 3,775 తనిఖీల్ని అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా 155 ఉల్లంఘనల్ని గుర్తించారు. ఎక్కువమంది గుమి కూడటం వంటి ఉల్లంఘనలు నమోదయ్యాయి. తవకల్నా యాప్ వినియోగించడంలేదనీ తేలింది. ప్రజారోగ్యం బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలనీ, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనీ అధికారులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com