వర్క్ పర్మిట్ వచ్చిన ఏడాదికి కార్మికుల బదిలీకి కువైట్ గ్రీన్ సిగ్నల్
- April 07, 2021
కువైట్ సిటీ:కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో కార్మిక శక్తికి కొరత రాకుండా ముందస్తు జాగ్రత్తలు, చట్ట సవరణలు చేపడుతున్న కువైట్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న, మధ్యతరగతి పారిశ్రామిక రంగాల్లో కార్మికుల బదిలీకి సంబంధించి కనిష్ట కాల పరిమితిని ఏడాదికి కుదించింది. అంటే వర్క్ పర్మిట్ జారీ అయి ఏడాది ముగిస్తే ఆ కార్మికుడిని యజమాని అంగీకారంతో బదిలీ చేసుకోవచ్చు. గతంలో ఈ కాలపరిమితి మూడేళ్లుగా ఉండేది. ఈ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ అబ్దుల్లా అల్ సల్మాన్ మంత్రిత్వ శాఖ నుంచి తీర్మానం జారీ చేశారు. అయితే...కార్మికుల బదిలీ సమయంలో యజమాని అనుమతి విషయంలో తీర్మానం నెంబర్ 9, 2016లో పేర్కొన్న నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- నేటి నుంచి కొత్త ఆధార్ యాప్ ఫుల్ వెర్షన్ అందుబాటులోకి..ప్రధాన ఫీచర్లు ఇవే..
- RBI: ప్రభుత్వ ఖాతాలోకి లక్షల కోట్లు..సామాన్యులకు పన్ను ఊరట?
- ప్రమాదానికి గురైన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానం
- స్పెషలిస్ట్ లేకుండా లేజర్ సెషన్లు..!!
- ముత్రాలో పడవ బోల్తా..మృతులు లైఫ్ జాకెట్లు ధరించలేదు..!!
- ఉత్తర ముహారక్ ఆరోగ్య కేంద్రంలో 24 గంటల సేవలు పునరుద్ధరణ..!!
- సౌదీలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సవాళ్లపై చర్చలు..!!
- కువైట్ లో ట్రాఫిక్ జరిమానాల పేరిట స్కామ్ మెసేజులు..!!
- దుబాయ్ లో ప్రపంచంలోనే మొట్టమొదటి గోల్డ్ స్ట్రీట్..!!
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు







