విదేశాల‌కు వెళ్లేవారు పాస్ పోర్టు వాలిడిటీ చెక్ చేసుకోవాల‌న్న దుబాయ్‌

- April 07, 2021 , by Maagulf
విదేశాల‌కు వెళ్లేవారు పాస్ పోర్టు వాలిడిటీ చెక్ చేసుకోవాల‌న్న దుబాయ్‌

దుబాయ్:దుబాయ్ నుంచి విదేశాలకు వెళ్తున్నారా? అయితే మీ ప్ర‌యాణానికి ముందు పాస్ పోర్టు వాలిడిటీ కాలాన్ని ఓ సారి చెక్ చేసుకోవాలంటూ డీజీఆర్ఎఫ్ ప్ర‌జ‌ల‌కు సూచించింది. విదేశాల‌కు వెళ్లేవారి పాస్ పోర్టు వాలిడిటీ క‌నీసం మూడు నెల‌లు అయిన ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది. ముఖ్యంగా ఇండియా, పాకిస్తాన్, యూఎస్‌, యూకే, పిలిఫ్పైన్స్ వెళ్లేవారు తప్ప‌నిస‌రిగా పాస్ పోర్టు గ‌డువు ముగిసే కాలాన్ని దుబాయ్ ఎమిరాతి ఎయిర్ లైన్స్ వెబ్ సైట్లో ఖ‌చ్చితంగా స‌రిచూసుకోవాల‌ని వెల్ల‌డించింది. అదే విధంగా ఆయా దేశాల నుంచి వ‌చ్చే వారి పాస్ పోర్టు, ఇత‌ర డాక్యుమెంట్ల కాల ప‌రిమితి గ‌డువు ఖ‌చ్చితంగా ఆరు నెల‌లైనా ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com