శంషాబాద్ విమానాశ్రయంలో 1.2 కేజీల బంగారం పట్టివేత..
- April 07, 2021
హైదరాబాద్:భారత్ లో ఉన్న విమానాశ్రయాల్లో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున బంగారం పట్టుబడుతోంది. విదేశాల నుంచి వస్తున్న వారు అక్రమంగా.. రహస్యంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడుతున్నారు. తాజాగా హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడింది.కొచ్చి నుంచి హైదరాబాద్ 6E-697 విమానం ద్వారా వచ్చిన ఓ ప్రయాణికుడు బంగాన్ని తీసుకువస్తున్నాడన్న పక్కా సమాచారం మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ ప్రయాణికుడి నుంచి రూ.60లక్షల విలువైన 1.2 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. అయితే ఈ బంగారం దుబాయ్ నుంచి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన బంగారం ఎవరికి ఇచ్చేందుకు తెచ్చారు.. ఎలా తెచ్చారు అన్న విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







