కేరళలో 'నోర్కా' సంస్థను సందర్శించిన తెలంగాణ బృందం

- April 08, 2021 , by Maagulf
కేరళలో \'నోర్కా\' సంస్థను సందర్శించిన తెలంగాణ బృందం

● నాన్ రెసిడెంట్స్ కేరలైట్స్ అఫైర్స్ (నోర్కా) అధికారులతో భేటీ 

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి అక్కడి ప్రభుత్వం  అమలుచేస్తున్న కార్యక్రమాలను అధ్యయనం చేయడానికి వెళ్లిన ఆరుగురు సభ్యుల తెలంగాణ బృందం గురువారం (08.04.2021) కేరళ రాజధాని తిరువనంతపురం లోని నోర్కా రూట్స్ కార్యాలయాన్ని సందర్శించింది.  

నాన్ రెసిడెంట్స్ కేరలైట్స్ అఫైర్స్ (నోర్కా రూట్స్) రిక్రూట్మెంట్ అధికారి అజిత్ కొల్లాస్సేరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా 'నోర్కా' సంస్థ కార్యకలాపాలను వివరించారు. తెలంగాణ బృంద సభ్యులు అడిగిన పలు సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.  కేరళలోని సెంటర్ ఫర్ ఇండియన్ మైగ్రంట్ స్టడీస్ (సిమ్స్) సంస్థ ప్రతినిధులు రఫీక్ రవుతర్, అఖిల్ శంకర్, పార్వతీ దేవి, సీనియర్ జర్నలిస్టు రెజిమోన్ కుట్టప్పన్ లు ఈ పర్యటనకు సంధానకర్తలుగా వ్యవహరించారు. 

గల్ఫ్ జెఏసి బృందంలో గుగ్గిల్ల రవిగౌడ్ (జగిత్యాల జిల్లా), స్వదేశ్ పరికిపండ్ల (నిర్మల్ జిల్లా), నంగి దేవేందర్ రెడ్డి (మహబూబ్ నగర్ జిల్లా),పెరుగు మల్లికార్జున్ (మంచిర్యాల జిల్లా), జలిగం కుమార్ స్వామి (సిద్దిపేట జిల్లా), గంగుల మురళీధర్ రెడ్డి (సంగారెడ్డి జిల్లా) ఉన్నారు.

కేరళలో పర్యటించిన అధికారుల బృందం ఇచ్చే అధ్యయన నివేదిక ఆధారంగా రాబోయే రోజుల్లో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఇటీవలి బడ్జెట్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో... తెలంగాణ గల్ఫ్ ప్రవాసి సంఘాల ప్రతినిధులము కేరళ పర్యటనకు వచ్చామని ఈ సందర్బంగా గల్ఫ్ జెఏసి కన్వీనర్ గుగ్గిల్ల రవిగౌడ్ అన్నారు. 

గల్ఫ్ నుంచి వాపస్ వచ్చిన వలస కార్మికుల పునరావాస కార్యక్రమాల అమలును పరిశీలిస్తామని, కేరళ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు  అందజేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను స్వయంగా పరిశీలించి ఒక నివేదికను తయారుచేసి  తెలంగాణ ప్రభుత్వానికి సమర్పిస్తామని నంగి దేవేందర్ రెడ్డి వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com