కోవిడ్ 19 : తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు
- April 08, 2021
కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ సందర్భంగా టెస్టుల సంఖ్య, వ్యాక్సిన్, వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి తీసుకుంటున్న చర్యలపై హైకోర్టుకు రిపోర్ట్ సమర్పించింది తెలంగాణ ప్రభుత్వం. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డీజీపీలు కూడా తమ రిపోర్టులను హైకోర్టుకు అందజేశారు. అయితే.. దీనిపై హైకోర్టు స్పందిస్తూ... ఆర్టీపీసీఆర్ టెస్టులు భారీగా పెంచాలని.. సేరో సర్వేలెన్స్ సర్వే ప్రారంభించామని ప్రభుత్వం చెప్పింది.. ఆ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది. లిక్కర్ షాపులు, పబ్స్, క్లబ్స్, సినిమా హాల్స్, ఫంక్షన్ హాల్స్ పై ఆంక్షలు విధించాలని హైకోర్టు తెలిపింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఉంటేనే రాష్ట్రంలోకి వచ్చేలా అడ్వైజరీ జారీ చేయాలని.. డిజాస్టర్ యాక్టు ప్రకారం నిపుణులతో అడ్వైజరీ కమిటీ వేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం చెప్పిన విధంగా 100 మంది ఉన్న కార్యాలయాల్లో వ్యాక్సినేషన్ చేయాలని.... మాస్కులు, సామాజిక దూరంపై నమోదైన కేసులు చాలా తక్కువ అని పేర్కొంది. కరోనా ప్రబలకుండా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..







