హీరోయిన్ నగ్మాకు కరోనా పాజిటివ్..వ్యాక్సిన్ తీసుకున్నాకే!

హీరోయిన్ నగ్మాకు కరోనా పాజిటివ్..వ్యాక్సిన్ తీసుకున్నాకే!

 కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంటే మహమ్మారి దరి చేరదని.. అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేసుకోవాలంటూ పలు ఆరోగ్య సంస్థలు, సినీ ప్రముఖులు ప్రచారం చేస్తుంటే.. మరోవైపు టీకా తీసుకున్న వారు కరోనా పాజిటివ్‌గా రావడం ఆందోళన కల్గిస్తోంది.

తాజాగా ప్రముఖ నటి, కాంగ్రెస్‌ నేత నగ్మా సైతం కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విటర్‌లో ప్రకటించారు.  ఈ సందర్భంగా ఆమె ఏప్రిల్‌ 2వ తేదీన కరోనా ఫస్ట్‌ డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికి ఆమె కరోనా సోకినట్లు స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు ఆమె తెలిపింది. 

Back to Top