ఎయిర్‌లైన్లకు మినిస్ట్రీ కీలక ఆదేశాలు!
- April 08, 2021
న్యూఢిల్లీ: గతేడాది లాక్‌డౌన్ సమయంలో క్యాన్సిల్ అయిన విమానాలకు సంబంధించి.. టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు వారి డబ్బులు తిరిగి ఇచ్చేయాలని విమానయాన సంస్థలకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం ఆదేశించింది. ఇటీవల ఇదే విషయమై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు.. పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు రద్దు అయిన విమాన సర్వీసులకు సంబంధించిన డబ్బులను ప్రయాణికులకు తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరింది. దీనికి మార్చి 31 వరకు గడువు విధించింది. ఈ లోపు ప్రయాణికులకు చెల్లింపులు జరగాలని ఆదేశించింది. దాంతో గో ఎయిర్, ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణికులకు డబ్బులు తిరిగి ఇచ్చేశాయి. కానీ, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఆసియా, విస్తారా ఇంకా ప్రయాణికులకు రిఫండ్ చేయలేదు. ఈ నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సెక్రెటరీ బుధవారం విమానయాన సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. లాక్‌డౌన్ సమయంలో రద్దు అయిన విమానాలకు సంబంధించిన డబ్బులను వెంటనే ప్రయాణికులకు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- సింగపూర్‌లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- హైదరాబాద్ పై కోల్‌కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్‌లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం
- సాహిత్యం సమాజ జాగృతికి శక్తివంతమైన సాధనం: డాక్టర్ నందిని సిధారెడ్డి
- జూన్ 5 నుండి ఎలక్ట్రానిక్ పేమెంట్ గేట్‌వే KNET అప్డెట్..!!
- సౌదీలో వారంలో రోజుల్లో 14వేలమంది బహిష్కరణ..!!
- బహ్రెయిన్‌కు అండగా నిలబడ్డ GCC ..!!
- ఒమన్ లో గృహ విద్యుత్ టారిఫ్‌లు తగ్గింపు..కోతలు ఉండవు..!!









