బహ్రెయిన్ నాయకత్వాన్ని అభినందించిన భారత ఉప రాష్ట్రపతి

- April 08, 2021 , by Maagulf
బహ్రెయిన్ నాయకత్వాన్ని అభినందించిన భారత ఉప రాష్ట్రపతి

బహ్రెయిన్: భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్ లతతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీకి ఘన స్వాగతం పలికారు. అధికారిక పర్యటనలో భాగంగా భారత్ చేరుకున్నారు డాక్టర్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ. ఈ సందర్భంగా భారత ఉప రాష్ట్రపతితో పలు అంశాలపై బహ్రెయిన్ విదేశాంగ మంత్రి చర్చలు జరిపారు. భారత ఉప రాష్ట్రపతి, బహ్రెయిన్ నాయకత్వం కరోనా పాండమిక్ సమయంలో అక్కడి భారత ప్రజలకు అందించిన సహాయ సహకారాల్ని కొనియాడారు. భారత్ - బహ్రెయిన్ మధ్య సన్నిహిత సంబంధాలు మరింత మెరుగు పరచడం ద్వారా ఇరు దేశాల అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందనీ, పరస్పరం సహకరించుకోవడం ద్వారా ఇది సాధ్యమవుతుందని ఇరువు నాయకులు అభిప్రాయపడ్డారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com