ఏపీలో లాక్ డౌన్ పై క్లారిటీ
- April 08, 2021
అమరావతి:ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు, వ్యాక్సినేషన్ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష అనంతరం మీడియాతో వైద్యారోగ శాఖ మంత్రి ఆళ్ళ నాని మాట్లాడారు. కరోనా కేసులు పెరుగుతున్నాయి అని, అయినా కోవిడ్ ను ఎదుర్కోవటానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్దంగా ఉందని అన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టనున్నామన్న ఆయన కోవిడ్ హాస్పిటళ్ళు, కోవిడ్ కేర్ సెంటర్లు, బెడ్స్ సంఖ్య పెంచమని సీఎం ఆదేశించారని అన్నారు.
లాక్ డౌన్, కర్ఫ్యూ వంటివి అమలు చేసే ఆలోచన లేదని, అయినా సరే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మాస్కులు, శానిటైజేషన్, భౌతిక దూరం పాటించటం, వ్యాక్సినేషన్ కు ముందుకు రావడం చేయాలని అన్నారు. నేటి వరకు రాష్ట్రంలో ఎక్కడా వ్యాక్సిన్ కొరత లేదని, ఇంకా 3.80 లక్షల డోసుల వ్యాక్సిన్ సిద్ధంగా ఉందని అన్నారు. కేంద్రానికి ఇండెంట్ పంపించామని, ఇవాళ, రేపటి లో 2 లక్షల డోసులు, వారంలో మరో 15 లక్షల డోసుల కేంద్ర నుంచి రానున్నాయని అన్నారు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







