ట్రాఫిక్ జరిమానాలు చెల్లిస్తేనే వీసా పునరుద్ధరణ

- March 02, 2016 , by Maagulf
ట్రాఫిక్ జరిమానాలు చెల్లిస్తేనే వీసా పునరుద్ధరణ

ముందు ట్రాఫిక్ జరిమానాలకు సంబంధించిన అన్ని జరిమానాల బకాయిలను చెల్లిస్తేనే విదేశీయులకు   వీసా పునరుద్ధరణ ఉంటుందని  రాయల్ ఒమన్ పోలీస్ ఉన్నతాధికారి చెప్పారు. బకాయిలు పడిన  విదేశీయులకు అవి చెల్లించిన తర్వాతే దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి లభిస్తుంది. జూన్ 1, 2015 నుండి   విదేశీయులకు ఎవరైనా  దేశం విడిచి వెళ్లడానికి ముందు కొంతకాలంగా ఆగిపోయి ఉన్న ట్రాఫిక్ జరిమానాలు చెల్లించడం తప్పనిసరి చేయబడింది.  ట్రాఫిక్ జరిమానాలు చెల్లించనివారు వేరే ఇతర దేశాలకు వెళ్లేందుకు వీలు లేదు. గతంలోనే ఈ చర్య మొదలైనప్పటికి  ప్రస్తుతం ఈ నియమాలను ఖచ్చితంగా అమలు చేయనున్నట్లు ఆ అధికారి పేర్కొన్నారు. ఒక ప్రజా సంబంధాల అధికారి తన కంపినీలో ఉద్యోగికి రెండేళ్ళ నివాస ముద్రను కేవలం పాత ట్రాఫిక్ జరిమానాను చెల్లించనందున పాస్ పోర్ట్  అధికారులు, రాయల్ ఒమన్ పోలీసులు  అనుమతి ఇవ్వలేదని తెలిపారు. పాస్పోర్ట్ మరియు రెసిడెన్స్ శాఖ డైరెక్టరేట్ జనరల్ ఫైసల్ అల్ వహాబీ మాట్లాడుతూ ఉద్యోగ పాస్ పోర్ట్ , గుర్తింపు కార్డులు, వీసాలు, నివాసం మరియు డ్రైవింగ్ కు  రహదారి అనుమతులకు సంబంధించిన పలు సేవల పరిధి ఇందులో భాగంగా ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com