ఓట్స్ తో ఇడ్లి..
- April 09, 2021
రోజు రోజుకీ మనిషికి ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. తినే తిండి విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొవ్వు, చేరని ఆహారపదార్ధాలు ఇంపార్టెంట్ ఇస్తున్నారు.గత కొన్నేళ్లుగా ఆదరణ సొంతం చేసుకుంది ఓట్స్.దీనికి కారణం ఇందులో ఉన్న పోషక విలువలు పైగా తయారు చేసుకోవడం సులభం. ఓట్స్ సులభంగా జీర్ణం అవుతాయి. కొవ్వును కరిగిస్తుంది.. బరువు తగ్గిస్తుంది. అందుకనే ప్రస్తుతం ఓట్స్ భారతీయులు తినే ఆహారపదార్ధాల్లో ఒకటిగా చేరిపోయింది.ఈరోజు ఇన్స్టెంట్ ఓట్స్ ఇడ్లీ రెసిపీ తెలుసుకుందాం..
కావలసిన పదార్ధాలు:
రోల్డ్ ఓట్స్ లేదా ఇనిస్టెంట్ ఓట్స్ – 1 కప్పు
చిలికిన పెరుగు కావాల్సినంత
నూనె – 1 టేబుల్ స్పూన్
శనగపప్పు – 1 టీ స్పూన్
మినప్పప్పు – 1 టీ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
ఆవాలు – 1 / 2 టీ స్పూన్
ఉల్లిపాయ – 1 (చిన్నగా తరిగినది)
పచ్చిమిరపకాయలు – 2 (తరిగినవి)
అల్లం ముక్క – 1 (తరిగినది)
క్యారెట్ – 1 (తురిమినది)
కరివేపాకులు
తరిగిన కొత్తిమీర
ఉప్పు రుచికి సరిపడా
నీరు
తయారీ విధానం:
ముందుగా ఓట్స్ ను మిక్సీలో బరకగా పొడి పట్టుకోవాలి.. తర్వాత దానిని ఒక పెద్ద బౌల్ లోకి తీసుకోవాలి. కొంచెం రోల్డ్ ఓట్స్ ను వేసుకోవాలి. ఇంతలో గ్యాస్ స్టౌ మీద బాణలి పెట్టి.. నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేయించాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వేసి వేయించాలి. కొంచెం సేపు వేయించిన తర్వాత.. స్టౌ మీద నుంచి దించేయాలి. తర్వాత వాటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఓట్స్ పొడి లో వీటిని వేయాలి.. దానిలో క్యారట్ తురుము, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత చిలికిన పెరుగుని వేసి ఇడ్లి మిక్స్ రెడీ చేసుకోవాలి. ఉప్పు చూసి… ఐదు నిముషాలు పక్కన పెట్టుకోవాలి. ఇడ్లి స్టాండ్ లో ఆ పిండి ని ఇడ్లి లా వేసుకుని గ్యాస్ స్టౌ మీద పెట్టి ఉడికించాలి. అయితే ఈ ఇడ్లిని విజిల్ లేకుండా ఆవిరి మీద ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే వేడి వేడి ఇన్స్టెంట్ ఇడ్లీ రెడీ.. నచ్చిన చెట్నీతో తింటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్కాయిన్ సీజ్ చేసిన అమెరికా