విదేశాలకు కరోనా వ్యాక్సిన్ ఎగుమతి పై అభ్యంతరం: రాహుల్ గాంధీ
- April 09, 2021
న్యూ ఢిల్లీ: విదేశాలకు కరోనా వ్యాక్సిన్ ఎగుమతి మీద రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇతర దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతిని రాహుల్ గాంధీ తప్పు పట్టారు. దేశ ప్రజలను ప్రమాదంలోకి నెట్టడం సమంజసమేనా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కరోనా ఉధృతి దశలో వ్యాక్సిన్ కొరత తీవ్రమైన సమస్య అని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సిన్ ఉత్సవం జరపాలని ప్రధాని పిలుపు ఇవ్వడం మీద రాహుల్ విమర్శలు గుప్పించారు.
వ్యాక్సిన్ కొరత ఉందని రాష్ట్రాలు చెబుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని రాహుల్ విమర్శించారు. వివక్ష చూపకుండా అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలానే వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ వేయాలని కోరుతూ ప్రధానికి రాహుల్ గాంధీ లేఖ రాశారు. వెంటనే టీకాలు ఎగుమతి నిలిపేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఇతర వ్యాక్సిన్లను త్వరగా తీసుకు వచ్చేందుకు కృషి చేయాలన్నారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







