వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సరికొత్త నిబంధనలు
- April 09, 2021
ఖతార్: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకుగాను ఖతార్ సరికొత్త నిబంధనల్ని తెరపైకి తీసుకొచ్చింది. సినిమా థియేటర్లు, కర్టెయిలింగ్ వర్కర్స్ అటెండెన్స్, పబ్లిక్ రవాణా కెపాసిటీ వంటివాటిని మూసివేయాలని నిర్ణయించాయి అథారిటీస్. మసీదులు రోజువారీ అలాగే వీక్లీ గ్రూప్ ప్రేయర్ల కోసం తెరిచే వుంటాయి. రమదాన్ సందర్భంగా స్వచ్ఛందంగా నిర్వహించే తరావిహ్ ప్రార్థనల్ని మాత్రం ఇంటికే పరిమితం చేయాలని అథారిటీస్ నిర్ణయం తీసుకున్నాయి. 12 ఏళ్ళ లోపు పిల్లల్ని మసీదుల్లోకి అనుమతించరు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో 50 శాతం కార్మికుల్నే అనుమతిస్తారు. సినిమాలు, థియేటర్లు, బార్బర్ షాపులు, బ్యూటీ సెలూన్లు, మ్యూజియంలు, పబ్లిక్ లైబ్రరీలు మూసివేస్తారు. గార్డెన్లు, బీచుల్లో ఎక్కువమంది గుమికూడటంపై నిషేధం వుంది. బోట్ మరాయు యాచ్ట్ సర్వీసులు సస్పెండ్ చేస్తున్నారు. ప్రజా రవాణా విషయానికొస్తే, సాధారణ పరిమితిలో 20 శాతం మాత్రమే అవకాశం కల్పిస్తారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







